Telugu Gateway
Politics

ప్ర‌భుత్వ ఖ‌జ‌నా వెల వెల‌..జ‌గ‌న్ ఖ‌జానా క‌ళ‌క‌ళ

ప్ర‌భుత్వ ఖ‌జ‌నా వెల వెల‌..జ‌గ‌న్ ఖ‌జానా క‌ళ‌క‌ళ
X

వైసీపీ స‌ర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానా వెల‌వెల పోతుంటే సీఎం జ‌గ‌న్ సొంత ఖ‌జానా మాత్రం క‌ళ‌క‌ళ‌లాడుతోంద‌ని ఆరోపించారు. మ‌ద్యం ధ‌ర‌లు మొద‌లుకుని ఇసుక ధ‌ర‌లు పెంచార‌ని, చివ‌ర‌కు చెత్త మీద కూడా ప‌న్నువేసిన చెత్త ప్ర‌భుత్వం ఇది అంటూ వ్యాఖ్యానించారు. మ‌నుషుల‌తో మాట్లాడే వాళ్లు కాకుండా ఇప్పుడు ఆత్మ‌ల‌తో మాట్లాడే వాళ్లు వ‌చ్చార‌ని ఎద్దేవా చేశారు. రైతుల ద‌గ్గ‌ర ధాన్యం కొనుగోలు చేసి వారికి డ‌బ్బులు కూడా చెల్లించ‌టంలేద‌ని..అడిగితే మంత్రులు..ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు బుధ‌వారం నాడు క్రిష్ణా జిల్లాలో దివంగ‌త కాగిత వెంక‌ట్రావు, కొల్లు ర‌వీంద్ర కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.

ఆ త‌ర్వాత కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడుతూ మాస్క్ పెట్టుకోక‌పోతే వంద రూపాయ‌లు జ‌రిమానా విధిస్తామ‌ని సీఎం జ‌గ‌న్ చెబుతున్నార‌ని..అస‌లు మాస్క్ పెట్టుకోని ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి ఎంత వ‌సూలు చేయాల‌ని ప్ర‌శ్నించారు. పోల‌వ‌రం నిర్వాసితుల‌కు ప‌రిహారం చెల్లించ‌కుండా వారిని గోదావ‌రిలో ముంచుతున్నార‌ని విమ‌ర్శించారు. వారికి న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పోరాటం చేస్తామ‌న్నారు. క్రిష్ణా నీళ్లు ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌కుండా సముద్రంలోకి పోతుంటే జగన్మోహ‌న్ రెడ్డి ఎక్కడ గాడిదలు కాస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడే ధైర్యం కూడా లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కావాల్సిన విద్యుత్ ఇస్తానని నీటి వృధాని అరికట్టలేడా? అన్నారు. జల్సాలు, అవినీతి తప్ప ఈ ముఖ్యమంత్రి ఏం తెలుసన్నారు. ప్రజలు భవిష్యత్తులో ఓటేసేందుకు భయపడే పరిస్థితి తెస్తున్నారని చెప్పారు. రెండేళ్లలో రాష్ట్ర విధ్వంసం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు.

Next Story
Share it