Telugu Gateway
Politics

ప్రత్యేక హోదాపై కేంద్రానికి మళ్ళీ అదే మాట

ప్రత్యేక హోదాపై కేంద్రానికి మళ్ళీ అదే మాట
X

కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రత్యేక హోదాపై తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. ఏపీకా ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని తెలిపింది. రాష్ట్రానికి ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీతోపాటు పలు అదనపు రాయితీలు కల్పించామని తెలిపింది. 14వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం దేశంలో కొత్తగా ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వటంలేదన్నారు. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ విషయాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయి.

పరిష్కారం మా చేతుల్లో లేదని..వీటిపై ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలన్నారు. పునర్విభజన చట్టంలోని పలు అంశాలు అమల్లో ఉన్నాయని..అవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సంద్భంగా లోక్ సభలో వైసీపీ పార్టీ నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ ప్యాకేజీతో సంబంధం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్ళు అయినా ఇంకా చాలా సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు.

Next Story
Share it