డ్యూటీ చేసిన పోలీసులను అరెస్ట్ చేస్తారా?
ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మైనారిటీ కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. తమ బాధ్యతలు నిర్వహించిన పోలీసులను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఎక్కడైనా ఇద్దరు రైతులు చనిపోతే సీఎం అరెస్ట్ చేస్తారా అని వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీ ఈ ఆత్మహత్యల విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని మండిపడ్డారు. తాము ఏదైనా మాట్లాడితే మత రాజకీయాలు అంటారని..ఇప్పుడు వీళ్లిద్దరూ చేస్తున్నది ఏమిటని అన్నారు.
రాష్ట్రంలో యథేచ్ఛగా ఎర్రచందనం రవాణా జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఎర్రచందనం అక్రమ సాగుతోందని ఆరోపించారు. ఈ అక్రమ రవాణాపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుంటే ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టాలని డిమాండ్ చేశారు. ముస్లిం సంఘాలను టీడీపీ అధినేత చంద్రబాబు రెచ్చగొడుతున్నారని సోము వీర్రాజు విమర్శించారు. పోలవరం విషయంలో ఏపీకి అన్యాయం జరగకుండా పోరాడింది బీజేపీయేనని తెలిపారు. బీజేపీ నేతల ప్రయత్నాల వల్లే ముంపు మండలాలను ఏపీలో కలిపారన్నారు. పోలవరాన్ని కేంద్రమే పూర్తిచేస్తుందని.. పోలవరం ఎత్తు తగ్గించేది లేదని వీర్రాజు పేర్కొన్నారు.