జగన్ ప్రభుత్వానికి బుర్ర పనిచేయటం లేదు

ఏపీ బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజు గతంలో ఎన్నడూలేని రీతిలో వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులకు సంచులు కూడా ఇవ్వలేక పోతున్నారు...ఇంకేమి ప్రభుత్వాలు నడుపుతారని ఎద్దేవా చేశారు. దోపిడీ ని ఈ ప్రభుత్వం నిర్మాణాత్మకం చేసిందని ఆరోపించారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..దేశం లో ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రధానిని కలవడం సాధారణం. సీఎం ఢిల్లీ టూర్ పై వైసీపీ డ్రామాలు చేస్తోంది. వైసీపీ - బీజేపీ మధ్య బంధుత్వం, మిత్రత్వం ఉంటే సీఎం జగన్ జాతీయ అద్యక్షడు నడ్డాని కలవాలి. సీఎం ఢిల్లీ టూర్ లకు రాజకీయాలకు సంబంధం లేదు. రాష్ట్రం లో బీజేపీ వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తుంది.
రాష్ట్రం లో సివిల్ సప్లై శాఖలో ఏం జరుగుతోంది. మిల్లర్లు ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్నారు. ఆర్ బికె కేంద్రాలతో భరోసా లేదు. మిల్లర్ల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మ. సివిల్ సప్లై ఎండీ నాలుగేళ్లుగా ఒకచోటే ఎందుకు ఉంటున్నారు!? రైతుల తరపున దీర్ఘ కాలిక ఉద్యమం ఉంటుంది. ఇళ్ల పట్టాల స్కాం లో నెల్లూరు జిల్లా కలెక్టర్ సెలవుపై వెళ్ళాడు. జగనన్న కాలనీ కాదు పేరుతో కొండలు తవ్వేశారు. అన్ని మోడీ చెయ్యాలి.....మరి రాష్ట్రం లో సీఎం ఎందుకు!? అని ప్రశ్నించారు.