కాంగ్రెస్ కు మరో షాక్..బిజెపిలోకి కోమటిరెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంత కాలంగా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ రచ్చ నడుస్తున్నా ఆయన ఇంతవరకూ దీనిపై నోరెత్తలేదు. అయితే కొత్త సంవత్సరం తొలి రోజున మాత్రం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. తాను బిజెపిలో చేరబోతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో చేరబోతున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్నారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. అన్నదమ్ములుగా కలిసి ఉంటామని రాజగోపాల్ పేర్కొన్నారు. పీసీసీ రేసులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఉన్నారని తెలిపారు. టీపీసీసీ ఎవరిని వరిస్తుందనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే తన సొంత అభిప్రాయం మేరకే పార్టీ మారుతున్నాని, దీనికి తన అన్నయ్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.