Telugu Gateway
Politics

రాసలీలల కర్ణాటక మంత్రి..రాజీనామా

రాసలీలల కర్ణాటక మంత్రి..రాజీనామా
X

వికెట్ పడిపోయింది. ఊహించినట్లుగానే కర్ణాటక మంత్రి రాజీనామా చేశారు. రాసలీలల వీడియోతో దొరికిన మంత్రి తన తప్పేమీలేదంటూనే..నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పంపటం..ఆయన దాన్ని గవర్నర్ కు సిఫారసు చేయటంతో ఈ ఆమోదం కూడా అంతే వేగంగా పూర్తి అయిపోయింది. దీంతో బిజెపిలో కీలక నేతగా ఉన్న జలవనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోలి ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఓ యువతితో రాసలీలలు జరిపిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రమేష్‌ రాజీనామా చేయాలని.. అతడిపై చర్య తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. వీడియోలు లీకైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రమేష్‌ తాజాగా దీనిపై స్పందించారు. అది ఫేక్‌ వీడియో అన్నారు. కానీ నైతిక కారణాల దృష్ట్యా తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

"నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో స్పష్టమైన దర్యాప్తు అవసరం. అది ఫేక్‌ వీడియో.. నేను నిర్దోషిగా బయటకు వస్తానని నాకు నమ్మకం ఉంది. నేను నైతిక కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను.. దీనిని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను" అని రమేశ్‌ తన రాజీనామ లేఖలో పేర్కొన్నారు‌‌. ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని బిజెపి వెల్లడించింది. యువతి ఓ ఉద్యోగం కోసం మంత్రి రమేశ్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో మంత్రి ఆమెను లోబచర్చుకున్నట్లు సమాచారం. అయితే తాను విచారణను ఎదుర్కోవటానికి వెనకాడబోనని..అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని రమేష్ జార్కిహోలి చెబుతున్నారు.

Next Story
Share it