రాజకీయ నేతలా ఎస్ఈసీ
ఏపీ మంత్రులు...వైసీపీ నేతలు వరస పెట్టి శనివారం నాడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు కురిపించారు. దీనికి కారణం ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషనే. మంత్రి బొత్స సత్యనారాయణ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత అవసరాల కోసం నిమ్మగడ్డ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎస్‌ఈసీకి అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉండాలన్నారు. ప్రజారోగ్యం ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత అని బొత్స చెప్పారు.
రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు?అని ప్రశ్నించారు. ఎన్నికలు ఆలస్యమైతే వచ్చే నష్టమేంటి అని ప్రశ్నించారు. ఎవరి మెప్పు కోసం నిమ్మగడ్డ ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? అని మంత్రి ప్రశ్నించారు. నిమ్మగడ్డ తీరు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేలా ఉందని బొత్స సత్యనారాయణ అన్నారు.