Telugu Gateway
Politics

ఏపీ రాజకీయ వివాదంలోకి వర్మ ఎంట్రీ

ఏపీ రాజకీయ వివాదంలోకి వర్మ ఎంట్రీ
X

హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారంనాడు భేటీ కావటం తో అధికార వైసీపీ ఏదో ఉలిక్కిపడినట్లు స్పందించింది. వాస్తవానికి అదేమీ అనూహ్య పరిణామం కాదు. పైగా వైసీపీ నేతలే వాళ్ళు ఇద్దరూ కలుస్తారు అని ఎప్పటినుంచో చెపుతూ వస్తున్నారు. చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లటంతో ఇక తమ పని అయిపోయింది అన్నంతలా స్పందించారు వైసీపీ నేతలు. దీనికి టీడీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. అయితే ఇందులోకి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. సహజం గానే ఆయనకు పవన్ కళ్యాణ్ అంటే పడదు...అదే సమయంలో సీఎం జగన్ కోసం రెండు రాజకీయ సినిమాలు తీసిపెడున్నాడు కూడా. అందుకే వైసీపీ వాదనకు మద్దతుగా అన్నట్లు ట్వీట్ చేశాడు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు అంటూ వర్మ ట్వీట్ చేశారు. దీనికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న అంతే దారుణంగా కౌంటర్ ఇచ్చారు. కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు... #RIPRGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటూ అయన వర్మ కు సమాధానం ఇచ్చారు. ఇది ఇంకా ఎన్ని దారుణ మలుపులు తిరుగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఒక్క మీటింగ్ తో పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మరో సారి కాక రాజేసినట్లు అయింది.

Next Story
Share it