Telugu Gateway
Politics

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పై తిరుగుబాటు

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పై తిరుగుబాటు
X

తెలంగాణ కాంగ్రెస్ లో మళ్ళీ కొత్త లొల్లి మొదలైంది. ఈ సారి సీనియర్ నేతలు అందరూ గళం విప్పారు. వీరి మాటలు చూస్తుంటే ఒక విషయంపై క్లారిటీ వస్తుంది. టార్గెట్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ కు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించినప్పటి నుంచి ఇదే రచ్చ కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఒక విషయం పోతే మరొకటి...ఒకరు పోతే మరొకరు. అంతే తేడా . రచ్చ మాత్రం కామన్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయంగా చావు దెబ్బ తింటదని తెలిసి కూడా విభజనకు ఆ పార్టీ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం పొన్నాల లక్ష్మయ్య ఒరిజినల్ కాంగ్రెస్ వాదికి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు. రెండవ సారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఇచ్చారు. వీళ్లిద్దరు ఒరిజినల్ కాంగ్రెస్ వాదులే. కానీ రెండు సార్లు పార్టీ ఘోర పరాజయం పాలు అయింది. పదేళ్ల తర్వాత అంటే రెండు సార్లు ఓటమి చవిచూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి కి పదవి ఇచ్చి ఒక ప్రయోగం స్టార్ట్ చేసింది.

దీన్ని అంగీకరించటానికి నేతలు సిద్ధంగా లేరు అని స్పష్టం అవుతోంది. అందుకే ఇప్పుడు పీసీసీ కమిటీల విషయంలో ఎక్కువ పదవులు వలసవాదులకు ఇచ్చారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. సేవ్ కాంగ్రెస్ పేరుతో తాము ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని ప్రకటించారు. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసం లో జరిగిన భేటీ అనంతరం వీరంతా కలిసి మీడియా ముందు సంచలన వ్యాఖలు చేశారు. ఈ భేటీలో మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గా రెడ్డి , మధు యాష్కీ, దామోదర్ రాజా నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ నేతలు అందరిది ఒకటే మాట...అసలు కాంగ్రెస్ వాళ్ళను కాదని ...వలసవాదులు పార్టీ పోస్ట్ లు ఇచ్చారని. దీంతో పాటు సోషల్ మీడియా వేదికగా తమపై విమర్శలు చేయించుతూ క్యారెక్టర్ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ ఇష్యూ ను ఎలా సెటిల్ చేస్తుందో చూడాలి.

Next Story
Share it