రాహుల్ ను ప్రధానిని చేయటమే వైఎస్ కు నిజమైన నివాళి
వైఎస్ రాజశేఖరరెడ్డి స్పూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం అని, అప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని వ్యాఖ్యానించారు. దివంగత వైఎస్ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల్లో ఆదరణ పొందిన నేత వైఎస్ అని కొనియాడారు.
ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజజ్ రీఎంబర్స్ మెంట్, జలయజ్ఞం, ముస్లిం లకు రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు అని తెలిపారు. వైఎస్ఆర్ కకు కి హైదరబాధ్ లో స్మృతి వనం లేకపోవడం అవమానమన్నారు. కుల సంఘాల భవనాలకు స్థలాలు ఇస్తున్నారు మంచిదే కానీ..వైఎస్ఆర్ స్మృతి వనం ప్రభుత్వం నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది.. రాగానే వైఎస్ఆర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు.