Telugu Gateway
Politics

వ్య‌స‌న‌ప‌రుల‌కు తెలంగాణ‌ను స్వ‌ర్ధ‌ధామంగా మార్చారు

వ్య‌స‌న‌ప‌రుల‌కు తెలంగాణ‌ను స్వ‌ర్ధ‌ధామంగా మార్చారు
X

తెలంగాణ ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటీఆర్ పై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సింగరేణి కాలనీలో జ‌రిగిన ఘటనపై వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కఠినంగా శిక్షించాలని హోంమంత్రి, డీజీపీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ ఎలా చేశారు? అని ప్రశ్నించారు. ఐదు రోజుల తర్వాత పరారీలో ఉన్నాడని పట్టుకుంటే రూ.10 లక్షల రివార్డు ప్రకటించారని చెప్పారు. నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడని కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? అని ప్ర‌శ్నించారు. విషసంస్కృతికిపై నిఘా విభాగాలు సీఎం కేసిఆర్ నివేదికలు ఇవ్వడం లేదా? అని సందేహం వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ ఏడున్నరేళ్ళ పాలనలో సీఎం కేసీఆర్ అవినీతి పెరిగిపోయిందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే దానిపై ఫిర్యాదు చేసేందుకు అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కోరారు. ఈనెల17వ తేదీన రాష్ట్రానికి వస్తున్న అమిత్ షాను ఎంపీ, ఎమ్మెల్యేలతో తాను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు చెప్పారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యసనపరులకు స్వర్గధామంగా మారిందని ఆరోపించారు. స‌ర్కారు నూటికి 90 శాతం తాగుబోతులను చేస్తోందని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శ‌లు గుప్పించారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగానే చూస్తోందని, ఆ మద్యంమత్తులోనే దారుణ సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరిగే దాడులకు కారణం మద్యమేనని పోలీసుల రికార్డులు చెబుతున్నాయని అన్నారు. 2021లో ఇప్పటివరకు 1,750 రేప్ కేసులు జరిగాయని వెల్లడించారు. అత్యంత పాశవిక సంఘటనలు జరగడానికి మద్యం, డ్రగ్స్ కారణమని వివరించారు.డ్రగ్స్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని 9 దర్యాప్తు సంస్థలకు తాను ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వాలు స్పందించకుంటే ప్రజాప్రయోజనాల వాజ్యం వేసినట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Next Story
Share it