Telugu Gateway
Politics

మీడియాకు ప్యాకేజీ ఇవ్వలేకే ఓడిపోయాం..రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మీడియాకు ప్యాకేజీ ఇవ్వలేకే ఓడిపోయాం..రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజీగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. 'కేంద్రం నుండి బీజేపీ అగ్ర నేతలు రంగంలోకి దిగారు. దేశం నలుమూలల నుంచి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస తరుపున గల్లీగల్లీలో మంత్రి తిరిగాడు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా సర్వశక్తులు కుమ్మరించి స్థానికం గా గెలవాలని ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసిన ప్రతి కార్యకర్త కు నమస్కారాలు. మీడియా ఈ సారి తనవంతు పాత్ర పోషించ లేదు.

తెలంగాణలో ప్రతి రాజకియ పార్టీ ఒక ఛానెల్ పెట్టలసిన అవసరం ఏర్పడింది. దీని వలన ప్రజా స్వామ్యం మీద నమ్మకం పోతుంది. మా పార్టీ ఒడి పోవటానికి మీడియానే ప్రధాన కారణం. ప్యాకేజీ ఇవ్వలేక ఒడిపోయాం. టీఆర్ఎస్, బిజెపి పార్టీలు డబ్బులు మీడియా సంస్థలకు ఇచ్చి సీట్లు గెలిచాయి. 2016 లో 10.4 శాతం ఓట్లు వచ్చిన వాటిని ఎక్కడా చెప్పలేదు ఎంత సేపు బీజేపీ భజన చేస్తున్నారు. 2016 కంటే మేము మెరుగైన ఫలితాలు సాధించాము. ఓటు బ్యాంక్ దాదాపు 4 శాతం పెరిగింది.' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it