రేవంత్ పై ఆర్జీవీ ప్రశంసలు
BY Admin27 April 2022 1:19 PM

X
Admin27 April 2022 1:19 PM
అసలు ఆ కాంబినేషనే వెరైటీ. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మలు కలిశారు. రేవంత్ తో కలసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆర్జీవీ నిజమైన తెలంగాణ టైగర్ తో అంటూ క్యాప్షన్ జోడించారు. ట్విట్టర్ లో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆర్జీవీ తెలంగాణ సీఎం కెసీఆర్ బయోపిక్ తీయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆర్జీవీ, రేవంత్ రెడ్డిల కలయికకు కారణం ఏమిటి అన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రియల్ టైగర్ అంటూ ప్రశంసించటం మినహా ఈ ఫోటో కింద ఆర్జీవీ ఎలాంటి అంశాలను ప్రస్తావించలేదు.
Next Story