Telugu Gateway
Politics

కెసీఆర్ కుటుంబ స‌భ్యుల‌పై సీబీఐ దాడులెందుకు చేయ‌టం లేదు?

కెసీఆర్ కుటుంబ స‌భ్యుల‌పై సీబీఐ  దాడులెందుకు చేయ‌టం లేదు?
X

లిక్క‌ర్ స్కామ్ లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఎం కెసీఆర్ కుటుంబ స‌భ్యుల‌పై విచార‌ణ సంస్థలు ఎందుకు దాడులు చేయ‌టం లేద‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. దీని వెన‌క ఉన్న కార‌ణాలు ఏమిట‌ని సందేహం వ్య‌క్తం చేశారు. ఢిల్లీలో ప‌లు చోట్ల సోదాలు చేసిన విచార‌ణ సంస్థ‌లు..ఇక్క‌డ ఎందుకు వ‌దిలేశార‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి బుధ‌వారం నాడు ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి త‌దిత‌రుల‌తో క‌ల‌సి మీడియాతో మాట్లాడారు. రేవంత్ వ్యాఖ్య‌ల్లోని ముఖ్యాంశాలు..'బీజేపీ చర్యలను ప్రతి పౌరుడు ఖండించాలి.. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తూన్నారు. ఢిల్లీ లో లిక్కర్ స్కాం జరిగిందని.. సీఎం కూతురు కవిత ఆ స్కాం లో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కు ఆర్థిక సహాయం చేశారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఆప్ ఇంచార్జి సోమనాథ్ భారతి మాట్లాడుతూ అవినీతి పరులైన కేసీఆర్ ను కలవమని చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతలను కేజ్రీవాల్ కలువరని మేం భావించాం. కానీ ఏం జరిగిందో ఏమో కానీ కేసిఆర్ వెళ్లి కేజ్రీ వాల్ ను కలిశారు. పంజాబ్ కు ఆయన తో కలిసి వెళ్లారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో వివిధ పార్టీలకు వందలాది కోట్లు ఇచ్చారని ఆరోపనలు ఉన్నాయి. దీంట్లో నిజా నిజాలు తేల్చాల్సిన భాధ్యత కేంద్రం పై ఉంది. కేసిఆర్ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తే వారి ఇళ్లలో సోదాలు ఎందుకు జరగడం లేదు. విచారణ సంస్థలు కేసిఆర్ ఆయన కుటుంబ సభ్యుల పాత్ర పై ఎందుకు స్పందించడం లేదు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే ఐ.టి కంపెనీల మీద దాడులు జరుగుతున్నాయి. 30 సంస్థల్లో సోదాలు జరిగాయి.. కేసిఆర్ కుటుంబ సభ్యుల ఇళ్ల పై ఎందుకు జరగడం లేదు. వారు ఆధారాలు మాయం చేసే ప్రమాదం లేదా?. ఎందుకు కేసిఆర్ కుటుంబానికి ఆ అవకాశం ఇస్తున్నారు. మీరే ఆరోపణలు చేస్తున్నారు. మీరే అధికారంలో ఉన్నారు.

అయినా వారి ఇళ్ల లో ఎందుకు సోదాలు జరగలేదు... దీని వెనుక ఉన్న లాలూచీ ఏంటి?. ఫోనెక్స్, సుమధర, వాసవి కంపెనీ ల పై దాడులు ఎందుకు ధృవీకరించలేదు. ప్రతీ ఎన్నికలప్పుడు భయపెట్టి లొంగ ధీసుకోవడం బీజేపీకి అలవాటు. గతంలో 140 కోట్ల నగదు దొరికిన హెటిరో కేసును సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు. రియల్ ఎస్టేట్ సంస్థల దాడుల్లో దొరికిన సమాచారం బయట పెట్టాలి. ఇందులో కెసీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు వాటాలు ఉన్నాయా..పెట్టుబ‌డులు పెట్టార‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. సిబిఐ, ఈడి ఎన్నికలు నిర్వహించే బీజేపీ అనుబంధ విభాగాలుగా పనిచేస్తున్నాయి. ఈడి, సిబిఐ తో భయపెట్టి నెగ్గాలని బీజేపీ చూస్తోంది. ఈడీ అంటే బీజేపీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ లాగా మారింది. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కట్టుగా నాటకాన్ని రక్తి కట్టిస్తున్నాయి. భూ కబ్జాలు చేశారన్న ఈటెల పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మేల్యే రాజాసింగ్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. రాజకీయాల ప్రయోజనాల కోసం టీఎర్ఎస్, బీజేపీ సమాజం మధ్య చీలిక తెస్తున్నాయి ఏ స్కాం లో నా సొంత సోదరుడు ఉన్న ఉరి తీయండి.. సంస్థలు అన్ని మీవే కదా. తెలిసిన వారు ఎవరు స్కాం లో ఉన్న దానికి నాకు సంబంధం ఉంటుందా. చుట్టాలు ఉంటే భాగస్వాములం అవుతమా. ఎవరు అక్రమాలకు పాల్పడిన నడి బజార్లో ఉరి తీయండి. ఈ నెలాఖరు వరకు మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తాం. ప్రియాంక గాంధీ తెలంగాణ పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. తెలంగాణకు పూర్తి స్థాయిలో సమయం ఇస్తానని చెప్పారు.' అని వెల్ల‌డించారు.

Next Story
Share it