Telugu Gateway
Politics

తెలంగాణ కాంగ్రెస్ కు ఆక్సిజన్ రేవంత్ రెడ్డి మాత్రమే

తెలంగాణ కాంగ్రెస్ కు  ఆక్సిజన్ రేవంత్ రెడ్డి మాత్రమే
X

మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఆక్సిజన్ రేవంత్ రెడ్డి మాత్రమే అన్నారు. గతంలో కాంగ్రెస్ కుమ్ములాటల ను ఏకతాటిపైకి తీసుకువచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా అధికారాన్ని దక్కేలా చేశారన్నారు. రేవంత్ రెడ్డి కి కూడా అలాగే ఆదరణ వస్తుందని తెలిపారు. మాజీ మంత్రి చిన్నారెడ్డితోపాటు దాసోజు శ్రవణ్ తదితరులు రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఊహించినట్లుగా పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సభకు హాజరు కాలేదు.

రేవంత్ రెడ్డి తలపెట్టిన రాజీవ్ ర‌ణ‌భేరి బ‌హిరంగ స‌భ‌లో బ‌ ల‌రాం నాయ‌క్‌, ష‌బ్బీర్ అలీ,రాజ‌య్య,సురేష్ షె‌ట్క‌ర్‌, కుసుమ కుమార్‌, మ‌ల్లుర‌వి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, సీత‌క్క‌, కొండా సురేఖ‌, కొండా ముర‌ళి, చిన్నారెడ్డి,వేం న‌రేంద‌ర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్‌,చ‌ల్లా న‌ర్సింహ్మ‌రెడ్డి, విజ‌య ర‌మ‌ణా రావు,డా.వంశీకృష్ణ‌,మోహ‌న్ రెడ్డి,మాన‌వ‌తా రాయ్‌,ఇందిరా శోభ‌న్‌, గీతా రెడ్డి,,దాసోజు శ్రవ‌ణ్ కుమార్‌.శ‌శిక‌ళ యాద‌వ రెడ్డి‌, ప‌రిగి రాంమోహ‌న్ రెడ్డి,మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి,అనిల్ కుమార్ యాద‌వ్‌, ప‌టేల్ ర‌మేష్‌రెడ్డి, సుభాష్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story
Share it