Telugu Gateway
Politics

తెలంగాణ రైతుల‌కు ఎందుకు పరిహారం ఇవ్వలేదు?

తెలంగాణ రైతుల‌కు ఎందుకు పరిహారం  ఇవ్వలేదు?
X

గ‌తంలో ఇచ్చిన ఏ హామీని కూడా అమ‌లు చేయ‌ని ముఖ్య‌మంత్రి కెసీఆర్ మాట‌లు న‌మ్మేది ఎలా? అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం చేసిన పోరాటంలో అమరులైన వారిని గుర్తించ‌టంలో కూడా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని మండిప‌డ్డారు. వీరికి ఎలాంటి సాయం కూడా చేయ‌లేద‌న్నారు. ఎన్ సీఆర్ బి నివేదిక ప్రకార‌మే టీఆర్ఎస్ పాలనలో 7,500 మంది రైతులు మృతి చెందారని, బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. హైదరాబాద్‌లో వరద బాధితులకు కూడా పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు.

పంజాబ్‌లో చనిపోయిన రైతుల కుటుంబాలకు..రూ.3 లక్షలు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణలో మరణించినవారికి ఇవ్వలేద‌న్నారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌లకు ఇచ్చిన ఏ హామీని కూడా కెసీఆర్ అమ‌లు చేయ‌టం లేద‌న్నారు. కేంద్రంలోని మోడీ స‌ర్కారు తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ర‌ద్దు చేయాలంటూ పోరాటం చేస్తూ చ‌నిపోయిన 750 మందికి సాయం అందిస్తామ‌ని కెసీఆర్ శ‌నివారం నాడు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it