నీ నాయన పుడితే మీకు గొప్ప..కానీ తెలంగాణకేంటి?
కెటీఆర్ మాటల్లో అహంభావం..అహంకారం
నిరుద్యోగ యువత ఆందోళనలో ఉన్న సమయంలో ఇలాంటి పిలుపులా?
ఖాళీల భర్తీకి మెగా నోటిఫికేషన్లు ఇస్తే అలాగే చేసేవాళ్లు
మీరు చేస్తున్న దుర్మార్గం ముందు..మేం మాట్లాడుతున్నది చాలా తక్కువ
విలాసవంతమైన జీవనానికి అవసరమైన వేల కోట్ల రూపాయల ఆస్తులు..రాసుకోవటానికి పేపర్లు..చూపించుకోవటానికి టీవీ, చేసుకోవటానికి మంత్రి పదవులు ఇచ్చినందుకు కెటీఆర్ కు ఆయన తండ్రిపై ప్రేమ ఉంటే తప్పులేదని..కానీ తెలంగాణ సమాజానికి ఏమి చేశారని ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే..మా నాయన పుట్టిండు కాబట్టి మూడు రోజులు పండగ చేసుకోండి అని కెసీఆర్ పిల్లలు పిలుపునిస్తారా?. మీ నాయన పుడితే మీకు గొప్ప. మీ నాయన పుడితే మీరు పండగ చేసుకోండి. మంది ఎందుకు పండగ చేసుకుంటారు. సీఎం కెసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడు రోజుల పాటు చేయాలంటూ కెటీఆర్ ఇచ్చిన పిలుపులోనే అహంభావం..అహంకారం. అధికార దుర్వినియోగం కళ్ళకు కట్టినట్లు కన్పిస్తోంది. ఏమి చేశారని తెలంగాణ సమాజం పండగ చేసుకోవాలి. పేదోళ్ల పిల్లలు చనిపోతున్నారు. ఇది కెసీఆర్, కెటీఆర్ నిర్లక్ష్యం వల్లే. మీరు చేస్తున్న దుర్మార్గం ముందు...మేం మాట్లాడుతున్నది చాలా తక్కువ. బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన కెటీఆర్ నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం కెసీఆర్ పుట్టిన రోజు అయినా నిరుద్యోగ యువత, చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చి ఉంటే కనీసం మిమ్మలను మనుషులుగా అయినా గుర్తించేవాళ్లం. మీ కడుపు నిండితే చాలు..మీరు సంతోషంగా ఉంటే చాలా?. తెలంగాణ సమాజం శవాల కుప్పగా మారినా పండగలు చేసుకుంటారా.. ఇంకా నేను ఏదో అన్నానని సిగ్గులేకుండా పోయి రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తుండు అంటూ మండిపడ్డారు. జో బైడెన్, జిన్ పింగ్,కిమ్ లతోపాటు ఇంకెవరిని అయినా కెటీఆర్ తెచ్చుకోవచ్చన్నారు. నిరుద్యోగుల ఆవేదన, చనిపోయిన కుటుంబాల బాధ గురించే తాను మాట్లాడానన్నారు.
రాష్ట్రంలో వందలాది మంది తల్లితండ్రులు...చదువుకున్న పిల్లలు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవటం వల్ల నిరాశకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లితండ్రులు కడుపుకోతకు గురై దుఖంతో ఉంటే..మంది పిల్లలు చచ్చిపోయి శవాలై ఉంటే..కెసీఆర్ పిల్లలు మాత్రం ఆయన జన్మదినం మూడు రోజులు ఉత్సవాలు జరుపుకోవాలని మాట్లాడుతున్నారు. ఇది మానవత్వమా అని ప్రశ్నించారు. కెటీఆర్ యవ్వారం ఎలా ఉందంటే స్కూల్ పిల్లలు సార్ వీడు నన్ను గిచ్చుడుతున్నడు..నా పెన్సిల్ లాక్కున్నాడు అని ఫిర్యాదు చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. నిజంగానే కెసీఆర్ పుట్టిన రోజు గొప్పగా జరుపుకోవాలంటే ఆయన జన్మదినం రోజు 1.91 లక్ష ల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వీటి భర్తీకి ఒక మెగా నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర ప్రజలు అభినందిచేలా..ప్రజలకు ప్రయోజనం చేకూరేలా తెలంగాణ సమాజం అంతా కెసీఆర్ జన్మదినం రోజు ఉత్సవాలు జరుపుకునే వారు..పండగలు జరుపుకునేవారు. సమస్యలు పరిష్కరించకుండా ఇలా చేయటం ఏమిటని ప్రశ్నించారు. వీళ్లు చేసిన నేరాలకు ఏమి చేసినా తక్కువే అని మండిపడ్డారు.