షాకింగ్...ఉన్నది 90 ఓట్లు.. పోలైంది మాత్రం 171 ఓట్లు
BY Admin5 April 2021 10:15 PM IST
X
Admin5 April 2021 10:15 PM IST
దేశంలో ఎన్నికల వ్యవహారం ఎంత ప్రహసనంగా మారిందో వరస సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఓ చోట అభ్యర్ధి కారులో ఈవీఎం కన్పిస్తుంది. మరో చోట అంతకు మించిన వింత. అసలు అక్కడ ఉన్నదే 90 ఓట్లు అయితే ఏకంగా 171 ఓట్లు పోలయ్యాయి అంట. అది ఎలా అంటారా?. ఈ సంగతి ఎన్నికల కమిషన్ మాత్రమే చెప్పాలి.
అస్సాంలోని దిమా హసో జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీంతో ఎన్నికల కమిషన్ ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. హఫ్ లాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఏప్రిల్ 1న జరిగిన పోలింగ్ లో ఈ వింత జరిగినట్లు ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. విషయం వెలుగులోకి రావటంతో ఇక్కడ రీపోలింగ్ కు ఆదేశించినట్లు సమాచారం.
Next Story