రాజాసింగ్ కు ఈసీ షాక్
తెలంగాణ బిజెపి శాసనసభాపక్ష నేత రాజాసింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. గోషామహల్ బిజెపిగా ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. యూపీలో బిజెపికి ఓటు వేయకుంటే వారి ఇళ్ళు గుర్తుపెట్టుకుని ధ్వంసం చేస్తామని ఆయన వీడియో సందేశం ద్వారా హెచ్చరించారు. దీని కోసం ఇప్పటికే సీఎం ఆదిత్యనాథ్ చాలా బుల్డోజర్లు తెప్పించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై 24 గంటట్లో వివరణ ఇవ్వాలని..లేదంటే చర్యలు తప్పవని ఈసీఐ హెచ్చరించింది.
రాజాసింగ్ వ్యాఖ్యలు ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంది. అన్ని పార్టీల నేతలు సంయమనంతో వ్యవహరించాలని సూచించింది. ఇప్పటికే యూపీలో రెండు దశల పోలింగ్ ముగిసింది. యూపీని చేజిక్కుంచుకునేందుకు అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అధికార బిజెపి మాత్రం ఈ సారి కూడా తామే యూపీని నిలబెట్టుకుంటామని ధీమాతో ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడి కానున్నాయి.