తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ ఖరారు
తెలంగాణ కాంగ్రెస్ లోకదలిక ప్రారంభం అయింది. ఈ మధ్యే నేతలందరూ విభేదాలను పక్కనపెట్టి ఒక్కతాటిపై నిలుస్తున్నారు. అయితే ఇది ఎంత కాలం ఇలా సాగుతుందో వేచిచూడాల్సిందే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యక్రమాల స్పీడ్ పెంచారు. పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు వీలుగా అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాటు చేశారు.
శనివారం నాడు కాంగ్రెస్ నేతల సమావేశంలో రాహుల్ పర్యటనపై స్పష్తత వచ్చింది. మే 6, 7 తేదీల్లో తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. మే 6న వరంగల్‌లో రాహుల్‌గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మే 7న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో రాహుల్ సమావేశం కానున్నారు. పార్టీ సీనియర్ నేతలతోపాటు ఆయన మరణించిన రైతు కుటుంబాల సభ్యులతోపాటు అమరవీరుల కుటుంబ సభ్యులను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.