Telugu Gateway
Politics

రాహుల్ టీ ష‌ర్ట్ పై వివాదం

రాహుల్ టీ ష‌ర్ట్ పై వివాదం
X

భార‌త్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీని బిజెపి టార్గెట్ చేసింది. యాత్ర‌లో ఆయ‌న వేసుకున్న టీ ష‌ర్ట్ ఖ‌రీదు 41,257 రూపాయ‌లు అని అధికారిక ఖాతా ద్వారా ట్వీట్ చేసింది. ఇది బ‌ర్ బెరీ బ్రాండ్ టీ ష‌ర్ట్ అని..దాని ధ‌ర వివ‌రాల‌ను పోస్ట్ చేసింది. అంతే కాదు..దేశం చూడాలి అంటూ..భార‌త్ దేఖో అని రాశారు. శుక్ర‌వారం ఉద‌యం నుంచే రాహుల్ టీ ష‌ర్ట్..దీని ఖ‌రీదుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. బిజెపి ట్వీట్ పై కాంగ్రెస్ స్పందించింది. బ‌ట్ట‌ల గురించి చ‌ర్చిద్దామంటే ఇది ప్ర‌ధాని మోడీ వేసుకున్న ప‌ది ల‌క్షల సూట్ వైపు వెళుతుంద‌ని పేర్కొంది. అధికారంలో ఉన్న బిజెపి మాట్లాడాల్సింది నిరుద్యోగం..ద్ర‌వ్యోల్బణం వంటి అంశాల‌పైన అంటూ చుర‌క‌లు అంటించింది. త‌న భార‌త్ జోడో యాత్ర‌పై ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉండొచ్చ‌ని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Next Story
Share it