Telugu Gateway
Politics

టీవీల్లో ఇంకా అబద్దపు ప్రసంగాలు

టీవీల్లో ఇంకా అబద్దపు ప్రసంగాలు
X

దేశానికి అన్నం పెట్టే రైతుల విషయంలో కేంద్రం న్యాయం చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆరు రోజులుగా రైతులు ఢిల్లీ వెలుపల ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. కేంద్రం కూడా ఈ పరిణామాలతో ఇరకాటంలో పడుతోంది. తాజాగా రైతుల ధర్నాకు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటిస్తూ మరోసారి ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా అహంకారాన్ని వీడి అన్నదాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కోరారు.

రైతులు రోడ్డెక్కారని, కానీ టీవీల్లో మాత్రం ఇంకా అబద్ధపు ప్రసంగాలు సాగుతున్నాయని ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతుల శ్రమకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలన్నారు. రైతులపైలాఠీచార్జ్, బాష్ప వాయుగోళాల ప్రయోగం ఏ మాత్రం మంచిది కాదన్నారు. అహంకారం అనే కుర్చీ దిగి రైతులకు న్యాయం చేసే విషయం ఆలోచించాలని కోరారు. అయితే కేంద్రం మంగళవారం నాడు రైతులతో చర్చించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Next Story
Share it