Telugu Gateway
Politics

రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్దరణ

రాహుల్ గాంధీ  సభ్యత్వం పునరుద్దరణ
X

కీలక పరిణామం. సుప్రీం కోర్టు తీర్పు మేరకు లోక్ సభ సెక్రటేరియట్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. మోడీ ఇంటి పేరు ఉన్న వాళ్ళు అంతా దొంగలే అంటూ ఒక ఎన్నికల సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయటం...దీనిపై కేసు లు నమోదు కావటంతో గుజరాత్ కోర్టు లు ఆయనకు రెండేళ్ల శిక్ష విధించటంతో ఆగమేఘాలమీద అయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంలో చూపించిన స్పీడ్ తీవ్ర విమర్శల పలు అయింది. బీజేపీ టార్గెట్ రాహుల్ గాంధీ గా వ్యవరించింది అనే అభిప్రాయం కలిగించటానికి అనర్హత వేటు నిర్ణయం అవకాశం కలిపించింది. కానీ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ విషయంలో మాత్రం ఆ స్పీడ్ చూపించలేదు అనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం సోమవారం ఈ మేరకు ఆదేశాలు రాకపోతే మాత్రం మరో సారి సుప్రీం కోర్టు గడప తొక్కాలని నిర్ణయం తీసుకుంది.

ఈ తరుణంలో సోమవారం ఉదయమే రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో రాహుల్ సభలో ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. ముఖ్యంగా గత సెషన్స్ లో ప్రధాని మోడీ, దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ల మధ్య సంబంధాలు ఇవిగో అంటూ అయన కొన్ని ఫోటోలను లోక్ సభలో ప్రదర్శించారు. అప్పటిలో అది పెద్ద దుమారమే రేపింది. మోడీ-అదానీల మధ్య బంధాన్ని రాహుల్ గాంధీ గట్టిగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ వస్స్తున్నారు. ఇది మోడీ కి మరింత ఆగ్రహం తెప్పించింది అనే ప్రచారం ఉంది. మొత్తానికి రాహుల్ గాంధీ తిరిగి ఎంపీగా ఎంట్రీ ఇవ్వనుండటంతో కాంగ్రెస్ పార్టీ లో సంతోషం వ్యక్తం అవుతోంది. సుప్రీం కోర్టు స్టే తో రాహుల్ గాంధీ పోటీ కి ఉన్న అడ్డంకులు కూడా తొలిగిపోయిన విషయం తెలిసిందే.

Next Story
Share it