Telugu Gateway
Politics

ప్రవీణ్ కుమార్ మారిపోయారు

ప్రవీణ్ కుమార్ మారిపోయారు
X

కెసిఆర్ జమానాలో జరిగిన టిఎస్ పీఎస్ సి పేపర్ల లీక్ వ్యవహారం తెలంగాణాలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన అటు బిఆర్ఎస్ సర్కారుతో పాటు ముఖ్యంగా కెటిఆర్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసింది. ఈ విషయం పై సీఎం గా ఉన్న సమయంలో కెసిఆర్ ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడకపోగా...కెటిఆర్ ఇచ్చిన వివరణలు అప్పట్లో ప్రభుత్వాన్ని మరింత డ్యామేజ్ చేశాయి. టిఎస్ పీఎస్ సి పేపర్ ల లీక్ విషయంలో నిరుద్యోగ యువత తరపున పోరాటం చేసిన వాళ్లలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒకరు. పోరాటం చేయటమే కాదు...ఈ పేపర్ లీక్ ల వెనక కెసిఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉంది అని అప్పటిలో సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తే కెసిఆర్ కుటుంబం పాత్రను నిరూపించటానికి కూడా సిద్ధం అంటూ ప్రవీణ్ కుమార్ పలు మార్లు మీడియా ముందు ప్రకటించారు. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే ఈ తరహా ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులు అందరికి అప్పటిలో నోటీసు లు జారీ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు ఈ విషయంలో ప్రవీణ్ కుమార్ కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇది కూడా గతంలో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోగానే ..కెసిఆర్ అండ్ కెసిఆర్ ఫ్యామిలీ ప్రవీణ్ కుమార్ కు మంచిది అయిపోయిందా?.

కెసిఆర్ కుటుంబ సభ్యులే పేపర్ల లీకేజీ కుట్రలో పాత్రధారులు అని ఆరోపించిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఏకంగా లోక్ సభ ఎన్నికల కోసం ఆ పార్టీ తో పొత్తు పెట్టుకోవటానికి రెడీ అవటంతో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ మూడవ ప్లేస్ కు పరిమితం కావటం ఖాయం అని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఆ పార్టీ కి ఒకటి లేదా రెండు సీట్లు వస్తే గొప్ప అన్నట్లు ఉంది ప్రస్తుత వాతావరణం. ఈ తరుణంలో బిఎస్ పీ , బిఆర్ఎస్ తో పొత్తు కు సిద్ధం అవటం తో గెలుపు విషయాలు పక్కన పెడితే ...ఇప్పటి వరకు ఉన్న ప్రవీణ్ కుమార్ ఇమేజ్ మొత్తం తాజా పరిణామంతో దెబ్బతినటం ఖాయం అనే చర్చ సాగుతోంది. పైగా ఈ పొత్తు వల్ల లోక్ సభ ఎన్నికల్లో పెద్దగా మార్పులు కూడా వచ్చే అవకాశం లేదు అనే అంచనాలు ఉన్నాయి. స్వయంగా కెసిఆర్ సీఎం గా ఉన్న సమయంలో రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని మీడియా సమావేశంలో చెపితే..ఇప్పుడు కెసిఆర్ ను కలిసిన తర్వాత ప్రవీణ్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది అని ఆరోపించడం విశేషం. మార్చాలి అన్నదే కెసిఆర్ . అలంటి కెసిఆర్ తో పొత్తు పెట్టుకుంటూ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది అని ఆరోపించడం ఇందులో హై లైట్ గా చెప్పుకోవచ్చు.

Next Story
Share it