ప్రశాంత్ కిషోర్ కు అసలైన పరీక్ష ఇదే..పార్టీ ఏర్పాటుకు నిర్ణయం
ఎన్నికల వ్యూహకర్త కాస్త రాజకీయ నేత అవతారం ఎత్తారు. దేశంలో పలు పార్టీల గెలుపునకు దిశా,నిర్దేశం చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తానే ఎన్నికల బరిలో నిలిచి...గెలవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. తాను నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇదే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కు అసలు పరీక్ష కానుంది. ఇప్పటివరకూ ప్రధాన పార్టీలకు వ్యూహకర్తగా ఉండి గెలుపునకు సహకరించిన ఆయన సొంత పార్టీతో విజయతీరాలకు చేరతారా?. లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఇతర పార్టీలకు వ్యూహాలు చెప్పటం వేరు..సొంతంగా పార్టీ పెట్టి విజయం సాధించటం వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పెట్టి గెలపుతీరాలకు చేరటం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
పార్టీలకు..ప్రజలకు మధ్య బలమైన బంధం ఉన్న సమయంలోనే ఏ పార్టీ అయిన విజయం సాధిస్తుంది. అయితేPrashant Kishor ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ప్రజాస్వామ్యంపై తనకు ఉన్న తపన, ప్రజల అనుకూల విధానాల విధానల రూపకల్పన కోసం నేరుగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ఓ పేజీ తిప్పి రియల్ మాస్టర్స్ అయిన ప్రజల దగ్గరకు వెళతానన్నారు. జన్ సురాజ్ పేరుతో ఆయన తన సొంత రాష్ట్రం బీహార్ నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయనకు బలమైన కోరిక ఉన్న విసయం తెలిసిందే. అంతా సాఫీగా సాగి ఉంటే ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండేవారు. కానీ పార్టీలో హోదాల విషయంలో ప్రశాంత్ కిషోర్ అనుకున్నది ఒకటి..కాంగ్రెస్ ఇస్తామన్నది మరొకటి కావటంతో దీనికి బ్రేక్ పడింది.