మంత్రులకు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదు
ప్రగతిభవన్ లో సీఎంను కలిసే అవకాశం మంత్రులకు కూడా లేదని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ అంశంపై బాధపడుతూ ఇంత అహంకారమా? అని ఓ రోజు మంత్రి గంగుల కమలాకర్ తనతో వ్యాఖ్యానించారని తెలిపారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తనపై చేసిన విమర్శలపై ఈటెల స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర లేదనడం సరికాదన్నారు. తనపై విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. తనకు గౌరవం, గుర్తింపు ఇవ్వలేదని అనలేదని ఆయన పేర్కొన్నారు. తాను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే చెప్పానని వ్యాఖ్యానించారు. 2014 వరకే కెసీఆర్ ధర్మాన్ని..ప్రజలను నమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన వ్యవహరం నచ్చకపోతే పిలిచి రాజీనామా చేయమంటే తానే చేసేవాడినని ఈటెల తెలిపారు.