Telugu Gateway
Politics

ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ లూట్ యోజ‌న‌

ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ లూట్ యోజ‌న‌
X

కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ సోమ‌వారం నాడు ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విమ‌ర్శ‌లు గుప్పించారు. 2014లో ఏ వాహ‌నం ఫుల్ ట్యాంక్ చేయించితే ఎంత ఖ‌ర్చు అయ్యేది..ఇప్పుడు అయితే ఎంత అవుతున్న‌దీ పోల్చుతూ ట్వీట్ చేశారు. దీనికి ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ లూట్ యోజ‌న అన్న హెడ్ లైన్ పెట్టారు. ఈ ట్వీట్ వైర‌ల్ గా మారింది. క‌రోనా స‌మ‌యంలోనూ మోడీ స‌ర్కారు ప్ర‌పంచ వ్యాప్తంగా క్రూడ్ ధ‌ర‌లు రికార్డు స్థాయికి ప‌త‌నం అయినా కూడా ర‌క‌ర‌కాల సెస్ ల‌తో రేట్లు పెంచుకుంటూ పోయింది త‌ప్ప‌..త‌గ్గిన ప్ర‌యోజ‌నం ఏరోజు కూడా వినియోగ‌దారుల‌కు బ‌దిలీ చేయ‌లేదు.

మ‌ధ్య‌లో ఒక‌ట్రెండుసార్లు మాత్రం ధ‌ర‌లు త‌గ్గించింది త‌ప్ప‌..ఈ ఎనిమిదేళ్ల‌లో పెంచిందే చాలా ఎక్కువ‌. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం ధ‌ర‌ల జోలికి వెళ్ల‌కుండా ఆ రాష్ట్రాల ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత వ‌ర‌స పెట్టి బాదుడు షురూ చేసింది. 2014లో ద్విచ‌క్ర వాహనం ఫుల్ ట్యాంక్ చేయించ‌టానికి 714 రూపాయలు అయితే..ఇప్పుడు అది 1038 రూపాయ‌లు అవుతుంది. కారుకు ఫుల్ ట్యాంక్ చేయించ‌టానికి 2014లో 2856 రూపాయ‌లు అయితే..ఇప్పుడు అది 4152 రూపాయ‌ల‌కు పెరిగింది. ఇలా ఏ వాహ‌నంపై ఎంత భారం ప‌డింది ఓ ఫోటో ద్వారా చూపించారు.

Next Story
Share it