చంద్రబాబు రుషికొండ పర్యటనకు పోలీసులు నో
BY Admin5 May 2022 11:18 AM
X
Admin5 May 2022 11:18 AM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్‌ని విశాఖపట్నంలోని ఎండాడ జంక్షన్‌లో పోలీసులు అడ్డుకున్నారు. హైవేపై చంద్రబాబు కాన్వాయ్‌ని నిలిపివేశారు. టూరిజం రిసార్ట్స్ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ రిషికొండను సందర్శించేందుకు చంద్రబాబు బృందం బయలుదేరింది. అనుమతి లేదంటూ చంద్రబాబు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆయనే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు.
Next Story