Telugu Gateway
Politics

సీఎం కేసీఆర్ కు మోడీ అభినందనలు

సీఎం కేసీఆర్ కు  మోడీ అభినందనలు
X

కరోనా నియంత్రణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన సూచనలను ప్రధాని మోడీ స్వాగతించారు. అదే సమయంలో అభినందనలు తెలిపారు. కరోనా పై సమీక్షా సమావేశానంతరం సిఎం కెసిఆర్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోను కాల్ లో మాట్లాడారని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. సమీక్ష సందర్భంగా సిఎం చేసిన సూచనలను కేంద్ర మంత్రి హర్షవర్దన్ తనకు వివరించారని ప్రధాని సిఎంకు తెలిపారు. '' మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి.

వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం..మీ సూచనలకు అభినందనలు' ' అంటూ ప్రధాని సిఎం కెసిఆర్ ను అభినందించారు. రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సిఎం కెసిఆర్ ప్రధానికి ఈ సందర్భంగా విజ్జప్తి చేశారు. సిఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని సిఎం కు హామీ ఇచ్చారు.

Next Story
Share it