అద్వానీ ఇంటికి ప్రధాని మోడీ
BY Admin8 Nov 2020 7:21 PM IST
X
Admin8 Nov 2020 7:21 PM IST
బిజెపి సీనియర్ నేత అద్వానికి ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటిలాగానే ఆయన ఈ సంవత్సరం కూడా అద్వానీ నివాసానికి చేరుకుని ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ..'అద్వానీ జీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన నివాసానికి వెళ్లడం జరిగింది.
ఆయనతో సమయం గడపటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. పార్టీ కార్యకర్తలకు, దేశానికి ఆయన సజీవ ప్రేరణ. ఆయన జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వెంటహోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. అద్వానీ ఆదివారం నాడు 93వ పుట్టిన రోజు జరుపుకున్నారు.
Next Story