Telugu Gateway
Politics

మోడీ ఇచ్చిన ఆప్షన్లు అవే

మోడీ ఇచ్చిన ఆప్షన్లు అవే
X

ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. దేశ ప్రజలకు మోడీ మూడు అప్షన్లు ఇచ్చారని..అందులో ఒకటి ఆకలి, రెండవది నిరుద్యోగం, మూడవది ఆత్మహత్యలు అన్నారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించవన్నారు. సాగు చట్టాల అమలుతో నిరుద్యోగం ఎక్కువవుతుందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో రాహుల్ శనివారంనాడు పర్యటించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రైతులతో మాట్లాడతామని ప్రధాని మోడీ చెబుతున్నారని, రైతులు మాత్రం చట్టాలు రద్దు చేసేంత వరకూ చర్చల ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయం అనేది భరతమాతకు చెందినదని, పారిశ్రామిక వేత్తలకు చెందినది కాదని వ్యాఖ్యానించారు. రాహుల్ తన పర్యటనలో భాగంగా రూపన్‌గఢ్‌లో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

Next Story
Share it