చంద్రబాబు..దగ్గుబాటి వైరల్ ఫోటో
సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ హల్ చల్ చేస్తోంది. చాలా కాలం తర్వాత తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు అప్యాయంగా పలకరించుకున్నారు. అంతే కాదు..ఇద్దరూ కలసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. వీరిద్దరి మధ్యా రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే వీరిద్దరి కలయికలు కూడా చాలా అరుదుగానే జరుగుతాయి. కుటుంబ వేడుకల్లోనూ చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుని అలా వెళ్ళి కన్పించిపోతారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అందుకే కావాల్సినంత సమయం.
తాజాగా దివంగత సీఎం ఎన్ఠీఆర్ చిన్న కుమార్తె తనయ వివాహవేడుక లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు, దగ్గుబాటి ఒకరినొకరు పలకరించుకున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కలసి ఫోటోలు దిగారు. తెలుగుదేశం అభిమానులు మాత్రం చంద్రబాబు, దగ్గుబాటి కలసి దిగిన ఫోటోను తెగవైరల్ చేసి ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అని..రాబోయే మంచి రోజులకు సంకేతం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.