Telugu Gateway
Politics

ఫోటో లు చెపుతున్న నిజాలు

ఫోటో లు చెపుతున్న నిజాలు
X

తెలంగాణాలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తి కర అంశంగా మారింది. ఎవరు ముఖ్యమంత్రి గా ఉన్నా రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. రాజకీయ విభేదాలకు దీనికి లింక్ పెట్ట కూడదు. కానీ గత బిఆర్ఎస్ సర్కారు, మాజీ సీఎం కెసిఆర్ మాత్రం ఈ సంప్రదాయాన్ని విస్మరించి తీవ్ర విమర్శల పాలు అయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కెసిఆర్ పలు సందర్భాల్లో ప్రధాని మోడీ ని కలిశారు. ఆ సమయంలో అయన వ్యవహరించిన తీరుకి...ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుకి మధ్య తేడా స్పష్టంగా చూడొచ్చు. మోడీ వయస్సు 73 సంవత్సరాలు అయితే...బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వయస్సు 70 సంవత్సరాలు . ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా పెద్దగా లేదు. కానీ అంతా బాగున్న రోజుల్లో ప్రధాని మోడీ ని కలిసిన చాలా సార్లు కెసిఆర్ వంగి వంగి దండాలు పెట్టారు. నిజానికి అది అవసరం లేదు. మోడీ ని కలిసిన కెసిఆర్ పథ ఫోటో లు చూస్తే అయన ఎలా వ్యవహరించారో చూడొచ్చు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తో పోలిస్తే గత రెండు టర్మ్స్ లోనూ కెసిఆర్ అత్యంత శక్తివంతంగా ఉన్నారు.

అయినా సరే అప్పటిలో మోడీ దగ్గర వంగి వంగి దండాలు పెట్టారు. విచిత్రం ఏమిటి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రోటోకాల్ ప్రకారం మోడీ కి గౌరవం ఇస్తూనే నిటారుగా నిలబడ్డారు తప్ప ఎక్కడా బెండ్ అయిన దాఖలాలు లేవు. ఏ రకంగా చూసుకున్నా కెసిఆర్ కంటే రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ దగ్గర కాన్ఫిడెంట్ గా ఉన్నారనే చెప్పాలి. అదే సమయంలో ప్రధాని అంటే పెద్దన్న అని ...తెలంగాణ కు కేంద్రం పెద్ద ఎత్తున సహకరించాలి అని ఆదిలాబాద్ సభలో మోడీ ని రేవంత్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. అయితే మోడీ ని రేవంత్ రెడ్డి పెద్దన్న అనడంపై బిఆర్ఎస్ రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇద్దరి మధ్య సంబంధాలకు ఇదే నిదర్శనం అని...తెలంగాణకు ప్రధాని ఏమి చేయకపోయినా మోడీ ని పెద్దన్న అనటం పై విమర్శలు చేసింది. గత ప్రభుత్వానికి బిన్నంగా ప్రధాని మోడీ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు కరెక్ట్ గా ఉంది అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it