Telugu Gateway
Politics

మోడీ, అమిత్ షా కుయుక్తుల్లో భాగ‌మే ఇది

మోడీ, అమిత్ షా కుయుక్తుల్లో భాగ‌మే ఇది
X

ఇజ్రాయెల్ కు చెందిన పెగాసెస్ సాఫ్ట్ వేర్ ద్వారా దేశంలోని ప్ర‌ముఖుల ఫోన్ల ట్యాపింగ్ వ్య‌వ‌హారం దేశంలో దుమారం రేపుతోంది. పార్ల‌మెంట్ ను సైతం ఈ అంశం కుదిపేస్తోంది. ఫోన్ల ట్యాపింగ్ అంశంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది హేయ‌మైన చ‌ర్య అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు చేసిన పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌ను.. విపక్షాలు, జడ్జీలు, జర్నలిస్టులపై ఉపయోగించడం దారుణ‌మ‌ని విమ‌ర్శించారు.

ఈ ప్రభుత్వం దేశభద్రతకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. విపక్ష నేతలు, జడ్జీలు సహా ప్రముఖుల ఫోన్‌లను హ్యాక్‌ చేయడం ప్ర‌మాద‌క‌ర ప‌రిణామం అని పేర్కొన్నారు. అధికారం నిలబెట్టుకోవడానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా కుయుక్తులకు పాల్పడుతున్నారని, పెగాసెస్‌ అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న చలో రాజ్‌భవన్‌కు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Next Story
Share it