కరోనా నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్
BY Admin8 May 2021 2:32 PM IST
X
Admin8 May 2021 2:32 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ శనివారం నాడు అధికారికంగా వెల్లడించింది. మూడు రోజుల క్రితం పవన్ కల్యాణ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ బృందం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించింది. అందులో నెగెటీవ్ వచ్చిందని తెలిపారు.
కరోనా తర్వాత పవన్ కొద్దిగా నీరసం గా ఉన్నారని ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యబృందం తెలిపింది. తన ఆరోగ్యం కోసం ఆకాంక్షించిన అభిమానులకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ల సూచనలు పాటించాలని సూచించారు.
Next Story