నిన్నటి మంత్రుల మీటింగ్ డుమ్మా..నేడు కొచ్చి కి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు మంత్రులు, సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. దీనికి జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమేవేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. అయితే మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావటం లేదు అనే విషయాన్ని ముందస్తుగా సమాచారం ఇచ్చారు. కానీ నిన్నటి అంటే మంగళవారం నాడు జరిగిన మంత్రులు, సెక్రటరీ ల సమావేశానికి మాత్రం ఎలాంటి సమాచారం లేకుండానే డుమ్మాకొట్టినట్లు కనిపిస్తోంది. పంచాయతీ రాజ్ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు జనసేన కు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కల్పించుకుని రెండు వారాలు గా పవన్ కళ్యాణ్ తీవ్రమైన నడుము నొప్పి తో బాధ పడుతున్నారు అని అందుకే సమావేశానికి రాలేదు అని చెప్పినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుంది. తాను పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆయన దొరకలేదు..ఇప్పుడు ఎలా ఉన్నారు అని మనోహర్ దగ్గర అరా తీసినట్లు ఈనాడులో వార్త వచ్చింది. అంటే చంద్రబాబు చెప్పిన మాటల ప్రకారమే చూస్తే సీఎం ఫోన్ చేసినా కూడా ఉప ముఖ్యమంత్రి అందుబాటులోకి రాలేదు కదా...మళ్ళీ తిరిగి కూడా స్పందించలేదు.
అంటే పవన్ కళ్యాణ్ సీఎం ఫోన్లు కూడా ఎత్తడం లేదు అనే విషయం ప్రజల్లోకి వెళుతుంది అని..ఇది ఎలాంటి సంకేతాలు పంపుతుంది అని టీడీపీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కానీ నిన్నటి కీలక సమావేశానికి డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్ బుధవారం నాడు మాత్రం కేరళలోని కొచ్చి వెళ్లారు. ఆయన బుధవారం నాడు కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు అని జనసేన చెపుతోంది. మరో విచిత్రం ఏమిటి అంటే గతంలో చంద్రబాబు కేవలం తన గురించి మాత్రమే చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు ఆయన తనతో పాటు ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ తరపున కూడా ఈయనే మాట్లాడుతున్నారు. తెలుగు జాతిని నంబర్ వన్ చేయటమే తన లక్ష్యం అని..మోడీ, పవన్ కళ్యాణ్ తాను కూడా ఇదే ఆలోచిస్తున్నాం అని చెప్పుకున్నారు.