Telugu Gateway
Politics

శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రద్దు

శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రద్దు
X

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంకా కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నందున శీతాకాల పార్లమెంట్ సమావేశాలను రద్దు చేశారు. అయితే అన్ని పార్టీలతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. నేరుగా జనవరిలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించ నున్నట్లు తెలుస్తోంది. సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేస్తూ లేఖ రాసిన నేపథ్యంలో మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై వివరణ ఇచ్చారు.

ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సంప్రదింపులు జరిపామని, సమావేశాలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు శీతాకాల సెషన్‌ను అన్ని కోవిడ్‌-19 ప్రోటోకాల్‌తో ఏర్పాటు చేయాలని బిర్లాకు రాసిన లేఖలో అధిర్ రంజన్ చౌదరి కోరారు. సాధారణంగా నవంబర్ నెలాఖరున లేదా డిసెంబర్ మొదటి వారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి.

Next Story
Share it