Telugu Gateway
Politics

ఒక్క తీర్పు...మూడు షాక్ లు !

ఒక్క తీర్పు...మూడు షాక్ లు !
X

ఉన్న పదవి పోయింది. కోట్ల రూపాయలు పోయాయి. పరువు పోయింది. మూడు ముక్కల్లో ఇది మునుగోడు బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలా రెడ్డి పరిస్థితి. ఇది ఆయనకు ట్రిపుల్ షాక్ అని కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఫుల్ ఖుషి ఖుషి గా ఉన్నాయనే చెప్పొచ్చు. మునుగోడు లో సాగుతున్నది ధర్మ యుద్ధం..ఇది మునుగోడుకు, సీఎం కెసిఆర్ కు యుద్ధం అంటూ చాలా మాటలు చెప్పారు రాజగోపాల్ రెడ్డి . కానీ ఒక్క దెబ్బకు సీన్ రివర్స్ కొట్టింది. రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ని చంపి..బీజేపీ ని పెంచాలని చూసిన ఆయనకు మునుగోడు ఓటర్లు ఝలక్ ఇచ్చారనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు మునుగోడు లో నామమాత్రంగా ఉన్న బీజేపీని అధికార టిఆర్ఎస్ తో డీ డీ అంటే అనే పరిస్థితికి తీసుకొచ్చింది మాత్రం రాజగోపాల్ రెడ్డి అని చెప్పటం లో సందేహం లేదు.

అయితే ఉన్న పదవిని పోగొట్టుకుని రాజకీయంగా ఓటమి పాలు అయి పరువు తీసుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయనకు ఓటమి ఒక సమస్య అయితే , మరో వైపు బీజేపీ లో చేరేందుకు అయన కేంద్రంలోని మోడీ సర్కారు నుంచి 18000 వేల రూపాయల కాంట్రాక్టు దక్కించుకున్నారని ఆరోపణలు ఈ ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపించాయి.ఇవి ఆరోపణలే కాదు .డాక్యూమెంట్స్ తో సహా ఆధారాలు కూడా అటు కాంగ్రెస్, ఇటు టిఆర్ఎస్ పార్టీలు ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాయి. ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా కూడా మారింది. వచ్చే ఎన్నికలనాటికి కూడా ఈ విషయం వెంటాడ వచ్చు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారం ఉంది కూడా విజయం సాధించలేక పోవటం రాబోయే రోజుల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Next Story
Share it