ప్రత్యేక సమావేశాల్లోపు కమిటీ నివేదిక ఇస్తుందా!

ఇందులో సభ్యులుగా కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. సాధ్యమైనంత త్వరగా ఈ హై లెవెల్ కమిటీ తన నివేదిక ఇవ్వాలని నోటిఫికేషన్ లో సూచించారు. కొద్ది రోజుల క్రితం వరకు మోడీ కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేస్తారని బలంగా ప్రచారం జరిగింది. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా నియమితులు అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విస్తరణ సమయంలో తన రాజీనామా ఉంటుంది అని ప్రకటించారు. ఎప్పుడు ఎన్నికలు ఉన్నా ఆయా రాష్ట్రాలకు క్యాబినెట్ లో ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు మోడీ. కానీ ఇప్పుడు అత్యంత కీలక రాష్ట్రాలు అయిన తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ , మిజోరం ల అసెంబ్లీ ఎన్నికలు ఉండగా క్యాబినెట్ విస్తరణను పక్కన పెట్టారు అంటే మోడీ ఈ అసెంబ్లీల తో పాటే లోక్ సభ కు ఎన్నికలకు సిద్ధం అయినట్లు కనిపిస్తోంది అనే చర్చ బలంగా సాగుతోంది. విపక్షాల ఇండియా కూటమి దూకుడుతో మోడీ లో టెన్షన్ మొదలైంది...అదే సమయంలో పదేళ్ల పాలనకు సంబధించి వ్యతిరేకత కూడా మరో కీలక అంశంగా ఉండనుంది.ఈ నెలాఖరు లోపు దేశ రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సిందే.