ఏపీ రాజధాని ఒకటా..మూడా ..లేక..!
కొద్ది రోజుల క్రితం మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా మూడు రాజధానులు అన్న ప్రచారం తప్పు...పాలన అంతా వైజాగ్ నుంచే అని ప్రకటించారు. అయన ఒకడుగు ముందుకు వేసి విశాఖపట్నం రాజధానిగా ప్రకటించాక పోతే తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటూ సంచలన వ్యాఖలు చేశారు. ఇప్పుడు తాజాగా మరో మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా మూడు రాజధానులు అన్నది మిస్ కమ్యూనికేషన్ అంటూ తాజాగా బెంగళూరు లో వ్యాఖ్యానించారు. కర్నూల్ లో హై కోర్ట్ ప్రిన్సిపాల్ బెంచ్ మాత్రమే ఉంటుంది అని...గుంటూరులో ఒక సారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అని చెప్పారు. మరి అలాంటి అప్పుడు అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం ఎలా చేసినట్లు...స్వయంగా జగన్ న్యాయ రాజధాని, శాసన రాజధాని, పరిపాలన రాజధాని అని ఎలా చెప్పినట్లు. అసలు మిస్ కమ్యూనికేషన్ ఎక్కడ నుంచి వచ్చింది...ఎవరినుంచి వచ్చింది అన్నది ఆంధ్ర ప్రదేశ్ మంత్రులే చెప్పాలి. సీఎం జగన్ చెప్పిన దానికి బిన్నంగా అటు ధర్మాన అయినా...ఇటు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అయినా చెప్పగలరా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు. దీంతో ఇది అంతా సీఎం జగన్ కనుసన్నుల్లో సాగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది అని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది అంతా చూసిన వాళ్ళు నాలుగేళ్ళ తర్వాత కూడా జగన్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని తో ఆడుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.