Telugu Gateway
Politics

కెసీఆర్ ను ఢీకొట్టే శ‌క్తి తెలంగాణ‌లో లేదు

కెసీఆర్ ను ఢీకొట్టే శ‌క్తి తెలంగాణ‌లో లేదు
X

తెలంగాణ‌లో కెసీఆర్ నుంచి అధికారం గుంజుకోవాలంటే ఎవ‌రి వ‌ల్లా కాద‌న్నారు మంత్రి కెటీఆర్. ముందు ఎవ‌రైనా తెలంగాణ‌ను ఆయ‌న కంటే ఎక్కువ ప్రేమించ‌టం నేర్చుకోవాల‌న్నారు..అప్పుడు ఏమైనా రెండు ఓట్లు రాల‌తాయ‌న్నారు. అంతే కానీ కెసీఆర్ ను ఢీకొట్టే శ‌క్తి తెలంగాణ‌లో లేద‌న్నారు. కెటీఆర్ గురువారం పార్టీ లో చేరిక‌ల సంద‌ర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. పీసీసీ ప‌ద‌వి కూడా ఓ ప్ర‌ధాని ప‌ద‌విలాగా కొంత మంది ఫీల్ అవుతున్నార‌ని రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కొత్త బిచ్చ‌గాళ్ళు వ‌చ్చార‌ని..ఏదో హంగామా చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. కెసీఆర్ ను తిడితే టీవీల్లో బ్రేకింగ్ లు వ‌స్తాయ‌ని..ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తాయ‌ని కొంత మంది ఇదే ఫ్యాష‌న్ గా పెట్టుకున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇదే రేవంత్ రెడ్డి గ‌తంలో సోనియాగాంధీని తిట్టార‌ని..ఇప్పుడు తెలంగాణ త‌ల్లి అంటున్నార‌ని వ్యాఖ్యానించారు.

రేపొద్దున చంద్ర‌బాబును తెలంగాణ తండ్రి అంటారేమో జాగ్ర‌త్తగా ఉండాల‌న్నారు. కొంత మంది కాంగ్రెస్ నేత‌లే ఇది పీసీసీ కాద‌ని..టీడీపీ పీసీసీ అని వ్యాఖ్యానించార‌న్నారు. తెలంగాణ‌లో పాద‌యాత్ర‌ల సీజ‌న్ స్టార్ట్ అయింద‌ని..బండి సంజ‌య్ పాద‌యాత్ర గురించి ప్ర‌స్తావించారు. పాద‌యాత్ర‌లు చేయండి..ఆరోగ్యం మెరుగుప‌ర్చుకోండి అని వ్యాఖ్యానించారు. గ్రామాల్లోకి వెళ్ళిన‌ప్పుడు అక్క‌డి డెవ‌ల‌ప్ మెంట్ చూడాల‌న్నారు. రాజ‌శేఖ‌ర‌రెడ్డి, చంద్ర‌బాబునాయుడు, కిర‌ణ్ కుమార్ రెడ్డిల వంటి వాళ్ల‌ను ఎదుర్కొన్న నాయ‌కుడికి ఢీకొట్టాలంటే డైలాగ్ లు కొడితే స‌రిపోద‌ని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో నాలుగు సీట్లు రాగానే బిజెపి ఎగిరి ప‌డింద‌ని.నాగార్జున సాగ‌ర్ లో ఏమైందన్నారు. జానారెడ్డి లాంటి సీనియ‌ర్ నేత‌ను కూడా ఓ యువ‌కుడు ఓడించార‌ని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను రాళ్ళ‌తో కొట్టాల‌ని రేవంత్ అంటున్నాడ‌ని..మ‌రి ఆయ‌న్న దేనితో కొట్టాల‌ని ప్ర‌శ్నించారు. కొనుగోళ్ల విష‌యంలో రేవంత్ రెడ్డి కంటే బాగా తెలిసిన వారు ఎవ‌రు ఉన్నారంటూ ఓటుకు నోటు కేసును ప్ర‌స్తావించారు.

Next Story
Share it