Telugu Gateway
Politics

ఈ సారి ముంద‌స్తు ఎన్నిక‌లు లేవు..కెసీఆర్

ఈ సారి ముంద‌స్తు ఎన్నిక‌లు లేవు..కెసీఆర్
X

టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌టం లేదని..ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న ఆదివారం నాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌తో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో హుజూరాబాద్ ఎన్నిక‌ల‌తోపాటు పార్టీ నిర్వ‌హించ త‌ల‌పెట్టిన బ‌హిరంగ స‌భ‌లపై మాట్లాడారు. ఈ స‌మావేశంలో కెసీఆర్ వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే...'ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ విజయ గర్జన సభ ఉండాలి. సభతో మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలి. ఈ సారి మనం ముందస్తు ఎన్నుకలకప వెళ్లడం లేదు. ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉంది.

మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రెండేళ్లు ఉంది కాబట్టి అన్ని పనులు పూర్తి చేసుకుందాం. మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్ట పడి పనిచేయండి. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నాం. వరంగల్ విజయ గర్జన సభకు ప్రతి ఊరు నుంచి బస్సు రావాలి.గ్రామ స్థాయి కమిటీలు అయి పోయాయి. హుజురాబాద్ లో టీఆర్ఎస్ 13% బీజేపీ కంటే లీడ్ లో ఉన్నాము. వరరంగల్ సభ ఇంచార్జీ గా వర్కింగ్ ప్రసెండెంట్ కేటీఆర్. వరంగల్ సభకు 22 వేల బస్సులతో జనం తరలింపు. ప్లీనరీ కి నియోజక వర్గం నుంచి 50 మంది వ‌చ్చేలా చూడాలి.'అని సూచించారు. ఈనెల 26 లేదా 27వ తేదీల్లో పాల్గొంటాన‌ని కెసీఆర్ వెల్ల‌డించారు.

Next Story
Share it