Telugu Gateway
Politics

అమ‌రావ‌తి రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పం

అమ‌రావ‌తి రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పం
X

ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అమ‌రావ‌తికి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతుల‌తో ఎలాంటి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌బోమ‌న్నారు. వారితో చర్చించే అంశాలు ఏమీ లేవ‌న్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని మ‌రోసారి పున‌రుద్ఘాటించారు. అమరావతి రైతులకు ఒనగూరే అంశాలకు కట్టుబడివున్నామన్నారు. లెజిస్లేటివ్ రాజధాని అమరావతిలోనే ఉంటుందని తెలిపారు. కేవలం ఇరవై గ్రామాలకో, ఓ సామాజిక వర్గానికో రాష్ట్ర భవిష్యత్తు పరిమితం కావాలా? అని ప్రశ్నించారు. విశాఖ‌ను ప‌రిపాల‌నా రాజ‌ధానిగా ప్ర‌క‌టిస్తే ఎందుకు కోర్టుకు వెళ్ళార‌ని ప్ర‌శ్నించారు. ఏ ఒక్క భ‌వ‌నం క‌ట్ట‌కుండా అడ్డుకున్నారు. ఏ మొహం పెట్టుకుని ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తార‌ని ప్ర‌శ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి చర్చా వేదిక పెట్టే హక్కులేదని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఏం చేసిందో చెప్పగలదా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టుపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మంత్రి విమ‌ర్శించారు. ''పెట్రోల్‌ ధరల పెంపుపై మేం అసంతృప్తిగా ఉన్నాం. పెట్రోల్‌ ధరలు కేంద్రం పరిధిలో ఉందన్న విషయం టీడీపీకి తెలియదా?. ధరలపై కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు నీలదీయరు?. ఉత్తరాంధ్రకు అశోక్‌ గజపతిరాజు ఏం చేశారు?. న్యాయ సమస్యలు పరిష్కారమయ్యాక మూడు రాజధానులను ఏర్పాటు చేస్తాం. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను సీఎం జగన్‌ వ్యతిరేకించారు. పార్లమెంట్‌లో వైఎస్ఆర్‌సీపీ తన నిర్ణయం చెప్పిందని'' బొత్స సత్యనారాయణ అన్నారు.

Next Story
Share it