Telugu Gateway
Politics

కెసీఆర్ ప్ర‌యాణాన్ని ఎవ‌రూ ఆప‌లేరు

కెసీఆర్ ప్ర‌యాణాన్ని ఎవ‌రూ ఆప‌లేరు
X

సిరిసిల్ల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ముఖ్య‌మంత్రి కెసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా వ‌ల్ల గ‌త ఏడాది రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్య‌క్షంగా..ప‌రోక్షంగా ల‌క్ష కోట్ల రూపాయ‌ల మేర న‌ష్ట‌పోయింద‌ని తెలిపారు. తెలంగాణ గురించి చాలా మంది గ‌తంలో తేలిగ్గా మాట్లాడార‌ని..కానీ ఏడేళ్ల‌లో ఎన్నో అద్భుతాలు చేశామ‌న్నారు. ఎవరు ఏమి చేసినా కేసీఆర్ ప్రయాణాన్ని ఆపలేరని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. .కరోనా మహమ్మారితో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందే మిషన్ కాకతీయ రూపకల్పన జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందా అనుకున్నారని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం గురించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయని కేసీఆర్ తెలిపారు. వలసలు వెళ్లిన తెలంగాణ ప్రజలు తిరిగొస్తున్నారని, కరీంనగర్ జిల్లాను అమృతవర్షిణిగా మారుస్తామని కేసీఆర్ చెప్పారు. 10 వేల కోట్ల రూపాయ‌ల‌తో వైద్య వ్యవస్థను పెంచాలని నిర్ణయించామని కేసీఆర్ చెప్పారు. అందులో భాగంగానే మెడికల్ కాలేజీల నిర్మాణమని కేసీఆర్ అన్నారు. జిల్లాకు త్వరలో ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తామని కేసీఆర్ చెప్పారు. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతున్నామని, తొలి ఏడాది విద్యార్థులకు రూ.5 వేలు, రెండో ఏడాది రూ.6 వేలు, మూడో ఏడాది విద్యార్థులకు రూ.7 వేల స్టైఫండ్ పెంచామని కేసీఆర్ చెప్పారు.

వేములవాడ ఆలయాన్ని అద్భుత కళాఖండగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ అన్నారు. చిత్త‌శుద్ధి, ల‌క్ష్యం ఉంటే ఏదైనా సాధించవ‌చ్చ‌ని చేసి చూపించామ‌ని తెలిపారు. ఒక ల‌క్ష్యాన్ని నిర్ధేశించుకుని అది సాధించే దిశ‌గా ముందుకు వెళుతున్నార‌ని వెల్ల‌డించారు. సిరిసిల్ల‌లో కొత్త క‌లెక్ట‌రేట్, డ‌బుల్ బెడ్ ఇళ్ళ‌తోపాటు ప‌లు కార్య‌క్ర‌మాల్లో సీఎం కెసీఆర్ పాల్గొన్నారు. వ్య‌వ‌సాయ రంగంలో గ‌త ఆరేళ్ల‌లో ఎన్నో అద్భుతాలు జ‌రిగాయ‌ని.వ‌ల‌స పోయిన వారు కూడా వెన‌క్కి వ‌స్తున్నార‌ని అన్నారు. తెలంగాణ పునాదిని ఎంత బ‌లంగా వేసుకుంటున్నామ‌నే దానికి ఇది ఓ సంకేతం అని తెలిపారు. గ‌తంలో హామీ ఇచ్చిన‌ట్లుగా 57 ఏళ్లు దాటిన వారికి పెన్ష‌న్ ఇస్తామ‌ని..త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గంలో దీనికి ఆమోద ముద్ర వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే చేనేత కార్మికులు, మ‌ర మ‌గ్గాల వారు మ‌ర‌ణిస్తే ఐదు ల‌క్షల రూపాయ‌లు పెన్ష‌న్ ప‌థ‌కం ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

Next Story
Share it