Telugu Gateway
Politics

మాట ప్రకారం సీఎం సీటు నితీష్ కుమార్ కే

మాట ప్రకారం సీఎం సీటు నితీష్ కుమార్ కే
X

బీహార్ లో ఎన్డీయే తిరిగి మెజారిటీ సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రెడీ అవుతోంది. అయితే ఈ సారి విచిత్ర వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికల్లో జెడీయూ అతి తక్కువ స్థానాలు దక్కించుకోగా...బిజెపి మాత్రం ఎక్కువ స్థానాలు దక్కించుకుంది. అందుకే సీఎం సీటు బిజెపి తీసుకుంటుందనే ప్రచారం మొదలైంది. బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి నితీష్ కుమార్ కు సీఎం సీటు డౌట్ అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ బీహార్ ఉఫ ముఖ్యమంత్రి, బిజెపి నేత సుశీల్ కుమార్ మోడీ దీనిపై స్పష్టత ఇచ్చారు.

సీఎంగా నితీష్ కుమారే ఉంటారని..ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారమే నడుచుకుంటామని వెల్లడించారు. నితీష్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ఒక్కో సారి ఒకరికి ఎక్కువ..మరొకరికి తక్కువ సీట్లు వస్తాయని..అయినా తాము సమాన భాగస్వాములం అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి అంతా సాఫీగా సాగిపోయినా రాబోయే రోజుల్లో బిజెపి నితీష్ కుమార్ కు చుక్కలు చూపించటం ఖాయం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

Next Story
Share it