Telugu Gateway
Politics

నితీష్ కుమార్ ఇక ఇంటికే

నితీష్ కుమార్ ఇక  ఇంటికే
X

బీహార్ లో మూడవ, చివరి దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. తొలుత సర్వేలు అన్నీ కూడా ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చినప్పటికి ..అసలు ఓటింగ్ ప్రారంభం అయ్యాక సీన్ మారినట్లు కన్పిస్తోంది. ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చెప్పటం కష్టం అయినా అంత ఈజీగా నితిష్ కుమార్ అధికారాన్ని నిలబెట్టుకునే పరిస్థితి లేదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్ జెడీ ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి గట్టి సవాలే విసిరింది. ముఖ్యంగా తేజస్వి యాదవ్ యూత్ ను ఆకట్టుకోవటంతో పాటు ఉద్యోగావకాశాల కల్పన హామీ ద్వారా అధికార కూటమికి పెద్ద సవాలే విసిరారు. పలు చోట్ల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి.

అంతే కాకుండా చివరి దశ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఇదే తన చివరి ఎన్నికలు అని..విజయమాల అందించాలంటూ ప్రకటించటం ద్వారా నితీష్ కుమార్ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా ప్రయోగించారు. మరి ఇవి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచిచూడాల్సిందే. శనివారం నాడు చివరి దశలో మొత్తం 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. తుది దశలో మెత్తం 2కోట్ల 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి నితీష్‌ సీఎం కాలేరని వ్యాఖ్యానించారు.

Next Story
Share it