Telugu Gateway
Politics

బీహార్ లో మళ్ళీ సేమ్ టూ సేమ్

బీహార్ లో మళ్ళీ సేమ్ టూ సేమ్
X

కాంబినేషన్ మారటం లేదు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, ఉఫ ముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ మోడీ. ప్రస్తుతం ఎలా ఉందో అలాగే. అయితే ఈ సారి బిజెపికి ఎక్కువ సీట్లు రావటంతో జెడీయూ కంటే ఆ పార్టీ ఎక్కువగా మంత్రి పదవులు..అవి కీలకమైన పదవులు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల అనంతరం ఎన్డీయే కూటమి ఆదివారం నాడు తొలిసారి సమావేశం అయింది. ఈ సమావేశంలో నితీష్ కుమార్ ను ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో నితీష్ కుమార్ బీహార్‌ పగ్గాలను నాలుగోసారి చేపడుతున్నట్లు అవుతుంది. నితీష్‌ కుమార్‌ ఇంట్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జేడీయూతో పాటు బీజేపీ, హెచ్‌ఎం, వికాశీల్‌ ఇన్సాన్‌ పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఎన్డీయే కూటమి పక్ష నేత, ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్‌ బెర్త్‌ లపై ఈ సమావేశంలో చర్చిస్తారు. 74 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ.. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పదవులు దక్కించుకోనుంది. బీజేపీ కంటే జేడీయూకి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు నితీష్‌ కుమార్‌నే తదుపరి ముఖ్యమంత్రిగా ఆమోదించారు. ముఖ్యమంత్రిగా రేపు నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. ఎన్డీయే కూటమిలో అవామీ మోర్చా, వికాస్‌ వీల్‌ హిన్సాన్‌ చెరో 4 చోట్ల గెలిచాయి.

Next Story
Share it