Telugu Gateway
Politics

కాంగ్రెస్ లో చేరికలు

కాంగ్రెస్ లో చేరికలు
X

తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత దుగిని శ్రీశైలం శనివారం నాడు కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఎస్ వేణుగోపాల చారి తో కలిసి ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ చేరికలపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.

శ్రీశైలం ప్రస్తుతం తెలంగాణ తెలుగు దేశం ఉపాధ్యక్షుడు ఉన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పంపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దుగిని శ్రీశైలం ఎస్సి సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. దీంతో పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. శ్రీశైలం తో పాటు మరి కొంత మంది నేతలు కూడా రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

Next Story
Share it