మోడీతో శరద్ పవార్ భేటీ

పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలకుపైగా సమయం ఉన్నా పార్టీలు అన్నీ ఇప్పటి నుంచే రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ఎవరికి వారు తమ వ్యూహలను పునర్ రచించుకునే పనిలో ఉన్నారు. మూడవ సారి కూడా అధికారంలోకి వచ్చి కొత్త రికార్డు నమోదు చేయాలని కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల నాటికి అయినా సర్వశక్తులు ఒడ్డేందుకు అవసరమైన ఏర్పాట్లలో ఉంది. కాంగ్రెస్ కు దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహయం అందించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు..ప్రశాంత్ కిషోర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరతారని ప్రచారం జరిగింది. ప్రశాంత్ కిషోర్ అంతకు ముందు రెండు సార్లు శరద్ పవార్ తో కూడా భేటీ అయ్యారు.
ఈ తరుణంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఈ భేటీ దాదాపు 50 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ''ప్రధానితో మోదీతో ఎన్సీపీ అధినేత పవార్ భేటీ అయ్యారు'' అంటూ పీఎంవో ట్వీట్ చేసింది. మరోవైపు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూశ్ గోయల్ కూడా పవార్‌తో శుక్రవారం సంప్రదింపులు జరిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ పేరు పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవార్, మోదీ భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే శరద్ పవార్ మాత్రం తాను రాష్ట్రపతి రేసులో లేనని ప్రకటించారు. అయితే మోడీ, శరద్ పవార్ భేటీ వివరాలు మాత్రం బహిర్గతం కావాల్సి ఉంది.