Telugu Gateway
Politics

కెసిఆర్ పై శరద్ పవార్ కూ క్లారిటీ వచ్చిందా?!

కెసిఆర్ పై శరద్ పవార్ కూ క్లారిటీ వచ్చిందా?!
X

బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఎన్ సి పీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చూస్తుంటే బీజేపీ కి బిఆర్ఎస్ బి టీమ్ లా కనిపిస్తోంది అని ఆరోపించారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ టార్గెట్ ఎన్ సిపీ , కాంగ్రెస్ లే గా ఉన్నట్లు కనిపిస్తోంది అన్నారు. ఇదే కెసిఆర్ గత ఏడాది ఫిబ్రవరి లో ముంబై వెళ్లి ఎన్ సిపీ అధినేత శరద్ పవార్ తో సమావేశం అయిన విషయం తెలిసిందే. శరద్ పవార్ ఎంతో అనుభవం ఉన్న నాయకుడు అని ..కొత్త విజన్, ఎజెండా తో ముందుకు సాగటానికి తాము కలిసి పని చేస్తామని ప్రకటించారు. పవార్ తనకు ఆశీస్సులు ఇచ్చారు అని, ఆయనతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కెసిఆర్ మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ని వదిలేసి కాంగ్రెస్, ఎన్ సిఫై వంటి పార్టీలను కెసిఆర్ టార్గెట్ చేయటం, ఆ పార్టీలకు చెందిన నాయకులను బిఆర్ ఎస్ లోకి చేర్చుకుంటున్న తీరుతో ఇది అంత ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి మేలు చేసేందుకే కెసిఆర్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది అని,,గత ఎన్నికల్లో ప్రకాష్ అంబేద్కర్ కు చెందిన వంచిత్ బహుజన్ అఘాది ఎలా తమ అవకాశాలను దెబ్బ తీసిందో అలాగే ఇప్పుడు బిఆర్ఎస్ తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది అని అయన మీడియా కు తెలిపారు.

మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లో బిఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని కెసిఆర్ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ కి వ్యతిరేకంగా పలు పార్టీల మద్దదు కూడగట్టే ప్రయత్నం చేసిన కెసిఆర్ ఇప్పుడు పూర్తిగా వాటికి దూరంగా ఉంటూ ....అసలు బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాల్లో ఏ మాత్రం పలు పంచుకోవటం లేదు. ఈ లెక్కన అసలు కెసిఆర్ దేశంలో మార్పు ఎలా తెస్తారు...ఎవరిని కలుపుకోకుండా...ఒక్క బిఆర్ఎస్ తో అది అసలు సాధ్యం అవుతుందా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా బిఆర్ఎస్ సొంతంగా పోటీ చేసి పెద్దగా సాధించేది ఏమి ఉండదు. అయిన కూడా ఒంటరి పోటీ అని చెపుతుంది అంటే ఎజెండా క్లియర్ అనే చర్చ సాగుతోంది. ఇది అంతా చూస్తుంటే బిఆర్ ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు తన సొంత అవసరాల కోసం పొలిటికల్ ఎజెండా లు మార్చుకున్నట్లు స్పష్టం అవుతోంది అని భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ను కాపాడుకునేందుకే కెసిఆర్ తాజాగా బీజేపీ తో డీల్ కు వచ్చారు అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి జాతీయ స్థాయిలో కెసిఆర్ ను నమ్మే వాళ్ళు చాలా తక్కువ అని...తాజా పరిణామాలతో ఇది మరింత డ్యామేజ్ కావటం ఖాయం అని చెపుతున్నారు. నిన్న మొన్నటి వరకు బిఆర్ఎస్ తో ఫ్రెండ్లీ పార్టీ గా ఉన్న జెడిఎస్ కూడా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తొలి కలిసి ముందుకు సాగే పనుల్లో ఉంది.

Next Story
Share it